శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- January 11, 2022
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు.మంగళవారం కస్టమ్స్ అధికారులు ముగ్గురు మహిళల నుంచి 1481.10 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసారు.పట్టుకున్న బంగారం విలువ రూ.72.80లక్షల విలువ ఉంటుందని పేర్కొంది.దుబాయ్ నుంచి 6E 8422 ఫ్లైట్ ద్వారా వచ్చిన ఓ మహిళ పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని లోదుస్తుల్లో దాచి తరలిస్తుండగా..రూ.48.71లక్షల విలువైన 991 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ నుంచి కువైట్ మీదుగా వచ్చిన J9-1403 విమానంలో వచ్చిన ఓ మహిళ పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని పురీషనాళం దాచి తరలించింది. సదరు మహిళను గుర్తించి ఆమె వద్ద నుంచి రూ.8.28 లక్షల విలువైన 168.5 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి 6E 8422 నంబరు గల విమానంలో వచ్చిన మరో మహిళ బంగారాన్ని తరలిస్తుండగా రూ.15.81లక్షల విలువైన 321.60 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







