కోవిడ్‌ వ్యాప్తి, నివారణా చర్యలపై సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్‌ సమావేశం..

- January 13, 2022 , by Maagulf
కోవిడ్‌ వ్యాప్తి, నివారణా చర్యలపై సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్‌ సమావేశం..

న్యూ ఢిల్లీ: భారత్‌లో కేవలం నెల రోజుల వ్యవధిలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల దాటడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.కోవిడ్ 19 పరిస్థితులపై ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ వర్చువల్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు అన్ని రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.అలాగే కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో.. అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఆస్పత్రులు, బెడ్స్, మెడిసిన్స్, ఆక్సీజన్, ఇతర మౌలిక వసతులను సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. యుక్త వయస్కుల వారికి కూడా వ్యాక్సిన్ వేగంగా వేయాలని దిశానిర్దేశం చేశారు ప్రధాని రేంద్ర మోదీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com