మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ‘రావణాసుర’ ప్రారంభం..

- January 13, 2022 , by Maagulf
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ‘రావణాసుర’ ప్రారంభం..

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల మధ్య ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరు స్పూర్తితోనే ఎవరి సపోర్ట్ లేకుండా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు రవితేజ. చిరుకి తమ్ముడిగా ‘అన్నయ్య’ లో నటించిన రవితేజ మరోసారి చిరు తమ్ముడిగా కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

కట్ చేస్తే.. ఇప్పుడు రవితేజ కొత్త సినిమా ప్రారంభోత్సవానికి చిరు ముఖ్య అతిథిగా విచ్చేస్తుండడంతో ఆ వార్తలు నిజమేననుకోవాలంటున్నారు ఇండస్ట్రీ జనాలు.. గతేడాది ‘క్రాక్’తో బ్లాక్‌బస్టర్ కొట్టి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు.. పాండమిక్ తర్వాత టాలీవుడ్‌కి కొత్త శుభారంభాన్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలు లైనప్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’, కొత్త డైరెక్టర్ శరత్ మండవ డైరెక్షన్లో ‘రామారావు – ఆన్ డ్యూటీ’, త్రినాధరావు నక్కినతో ‘ధమాకా’, వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలతో పాటుగా సుధీర్ వర్మతో ‘రావణాసుర’ అనే మరో సినిమా అనౌన్స్ చేశారు.

రవితేజ హీరోగా నటిస్తున్న 70వ సినిమా ఇది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. జనవరి 14 ఉదయం 9:51 గంటలకు ‘రావణాసుర’ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. ఈ ఓపెనింగ్ సెరమనీకి చిరు గెస్ట్‌గా విచ్చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com