కోవిడ్ 19 పాజిటివ్ కేసులు, క్లోజ్ కాంటాక్టుల విషయంలో సేఫ్టీ ప్రోటోకాల్స్ అప్‌డేట్

- January 14, 2022 , by Maagulf
కోవిడ్ 19 పాజిటివ్ కేసులు, క్లోజ్ కాంటాక్టుల విషయంలో సేఫ్టీ ప్రోటోకాల్స్ అప్‌డేట్

యూఏఈ: అబుదాబీ, శుక్రవారం సవరించిన విధి విధానాల్ని కోవిడ్ పాజిటివ్ కేసులు, క్లోజ్ కాంటాక్టులకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. కోవిడ్ సోకిన 50 ఏళ్ళ వయసు పైబడినవారు, కోవిడ్ లక్షణాలు వున్నవారు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు, గర్భిణీ మహిళలు కోవిడ్ 19 ప్రైమ్ అస్సెస్‌మెంట్ సెంటర్‌ని మెడికల్ ఎస్సెస్‌మెంట్ అలాగే ఐసోలేషన్ కోసం సంప్రదించాలి. ైసోలేషన్ పూర్తి చేసుకోవడానికి రెండు నెగెటివ్ ఫలితాల్ని 24 గంటల వ్యవధిలో పొందాల్సి వుంటుంది. 8 అలాగే 10వ రోజున పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఐసోలేషన్ చివరి మూడు రోజులపాటు ఎలాంటి లక్షణాలూ వుండకూడదు. ఇతర కేటగిరీల్లోనివారు స్వల్ప లక్షణాలు లేదా మధ్యస్థ లక్షనాలు వుంటే, వారికి ఎలాంటి తీవ్ర అనారోగ్యాలూ లేనివారైతే, సమీపంలోని హెల్త్ ఫెసిలిటీ వద్ద రీ-టెస్ట్ చేయించుకోవాలి. ఐసోలేషన్‌లో వుండాలి. రిటెస్టులో కూడా పాజిటివ్ వస్తే, నిపుణుడి సూచనలతోతో ఐసోలేషన్ పాటించాలి. పాజిటివ్ కేసులకు క్లోజ్ కాంటాక్ట్ అయినవారికి పిసిఆర్ టెస్ట్ విషయమై మెసేజ్ పంపబడుతుంది. వారికి హోం క్వారంటైన్ తప్పనిసరి. వ్యాక్సినేషన్ పొందినవారికి వారం రోజులు క్వారంటైన్ వుంటుంది. వ్యాక్సినేషన్ పొందనివారైతే పది రోజులు క్వారంటైన్ తప్పనిసరి. ఆరు మరియు తొమ్మిదవ రోజున నిర్వహించే టెస్టుల్లో నెగెటివ్ వస్తే, వారు యధాతథంగా తిరిగి తమ పనులు చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com