తెలంగాణ కరోనా అప్డేట్

- January 14, 2022 , by Maagulf
తెలంగాణ కరోనా అప్డేట్

హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు క‌రోనా వ్యాప్తి పెరుగుతుంది.దీంతో ప్రజల్లో ఆందోళ‌న పెరుగుతుంది.ఈ రోజు తాజా గా రాష్ట్ర వ్యాప్తంగా 2,398 క‌రోనా కేసులు వెలుగు చూశాయి. గురువారంతో పోలిస్తే.. 79 క‌రోనా కేసులు పెరిగాయి.రాష్ట్రంలో క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్యాఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేసిన క‌రోనా బులిటెన్ ప్రకారం .. తాజాగా 2,398 కరోనా కేసులు న‌మోదు అయ్యాయి.

దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు వచ్చిన కరోనా కేసుల సంఖ్య 7,05,199 కు చేరింది.నేడు కరోనా కారణంగ ముగ్గురు మృతి చెందారు.రాష్ట్రంలో ప్రస్తుతం మృతుల సంఖ్య పెరుగుతుంది.ప్రతి రోజు ఒక‌రు లేదా ఇద్దరూ క‌రోనా తో మ‌ర‌ణించే వారు ఎక్కువ అవుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,052 కు చేరింది. కాగా ఈ రోజు రాష్ట్రంలో అత్యధికంగా 1,181 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,676 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com