‘బేబీ’ మూవీ స్పెషల్ పోస్టర్ విడుదల

- January 14, 2022 , by Maagulf
‘బేబీ’ మూవీ స్పెషల్ పోస్టర్ విడుదల

హైదరాబాద్: న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘బేబీ’. దర్శకుడు సాయి రాజేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘బేబీ’ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ చేస్తున్నారు.ఈ సినిమా గురించి దర్శకుడు సాయి రాజేశ్‌ మాట్లాడుతూ, ”ఇదో నేచురల్, ఇన్నోవేటివ్ లవ్ స్టోరీ.ఈ సినిమా ఫ్లేవర్ ను రిఫ్లెక్ట్ చేస్తూ ఒక కొత్త తరహా పోస్టర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేశాం. గోడల మీద రాతలు బాగా తెలిసినవే.ఈ రాతల్లో ప్రేమ గురించి అనేక స్లోగన్స్, పోయెట్రీ కనిపిస్తుంటుంది. ‘ప్రేమించు కానీ నటించకు రా, మనసులో ఉంచుకో, మళ్లీ వస్తా… ‘ ఇలాంటి కొటేషన్స్ లవర్స్ ఎక్స్ ప్రెషన్స్ ను చూపిస్తాయి.గోడ మీద రాతలతో డిజైన్ చేసిన ఈ పోస్టర్ కు మంచి స్పందన లభిస్తోంది” అని అన్నారు.

విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ లాంటి సూపర్ హిట్ సినిమా నిర్మించిన ఎస్. కె. ఎన్. ‘బేబీ’ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్.కె.ఎన్., దర్శకుడు మారుతి సంయుక్త సంస్థ మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ‘బేబీ’ సినిమా నిర్మితమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com