త్రివిక్రమ్‌తో నవీన్ పొలిశెట్టి కొత్త సినిమా.. టైటిల్ ప్రకటన..

- January 16, 2022 , by Maagulf
త్రివిక్రమ్‌తో నవీన్ పొలిశెట్టి కొత్త సినిమా.. టైటిల్ ప్రకటన..

నవీన్ పొలిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నవీన్ జాతిరత్నాలు సినిమాతో బంపర్ హిట్ కొట్టి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇప్పుడో హాట్ కేక్‌గా మారారు. వరుసగా తను హీరోగా వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. అందులో భాగంగా ఆయన హీరోగా చేస్తోన్న మరో చిత్రానికి సంబంధించిన అప్ డేట్ వచ్చింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రూపొందనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా టైటిల్ ప్రకటన వచ్చింది. ఈ సినిమాకు అనగనగా ఒక రాజు అనే పేరును టైటిల్‌గా ప్రకటించారు. అంతేకాదు దీనికి సంబంధించి టైటిల్ టీజర్‌ను విడుదల చేసింది టీమ్. ఈ టైటిల్ టీజర్ నెటిజన్స్ బాగానే ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

సాయి సౌజన్య ఫార్చ్యూన్ 4 సినిమాస్‌ అనే బ్యానర్‌పై సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాకు 'జాతి రత్నాలు' దర్శకత్వ శాఖలో పని చేసిన కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అన్ని కార్యక్రామాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర టెక్నికల్ సిబ్బంది గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com