అబుధాబి పై ఉగ్రదాడి...ఖండించిన యూఏఈ ప్రభుత్వం..
- January 17, 2022
అబుధాబి: యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ అబుధాబిలో దాడిని ఖండించింది.ఈ దాడికి పాల్పడిన వారిని విధిగా శిక్షిస్తామని యూఏఈ ప్రతిజ్ఞ చేసింది.
"ఈ ఉగ్రవాద దాడులు, పెరిగిపోతున్న నేరాలపై ప్రతిస్పందించే హక్కు యూఏఈకి ఉంది" అని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.అంతర్జాతీయ మరియు మానవతా చట్టాలను ఉల్లంఘిస్తూ, హౌతీ మిలిటంట్లు చేసిన ఈ దాడులను "హీనమైన నేరం"గా అభివర్ణించింది.
యూఏఈలో అస్థిరత కలిగించేందుకు హౌతీ బృందం తీవ్రవాదం మరియు గందరగోళాన్ని వ్యాప్తి చేస్తూనే ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.పౌరులు మరియు పౌర సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద చర్యలను ఖండించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది యూఏఈ.
మృతుల కుటుంబాలకు మంత్రిత్వ శాఖ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
కాగా, అబుధాబి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ దాడి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. డ్రోన్ దాడులకు తమ పనేనని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ఓ ప్రకటనలో వెల్లడించగా..ఈ డ్రోన్ దాడిలో మూడు ఆయిల్ ట్యాంకర్లు పేలిపోయినట్టు అధికారులు తెలిపారు.అబుధాబి విమానాశ్రయంలోని ఇంధనం వాహన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు సమాచారం.సెప్టెంబరు 14, 2019న సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు స్థావరాలపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల ఫలితంగా పెర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.తాజా దాడుల్లో.. మూడు చమురు ట్యాంకర్లు పేలిపోయినట్టు అధికారులు వెల్లడించారు.యూఏఈ యొక్క కొత్త విమానాశ్రయం నిర్మాణ స్థలంలో మంటలు సంభవించినట్లు అబుధాబి పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







