అల్పున్ని


ఒకసారి నువ్వు విహార యాత్రల తొలి నాళ్ళలో 
చూసిన యవ్వన మోహన చూపు,
మరొకసారి నీతో కలిసి కొద్ది నిమిషాల
నా అద్రుష్టంపై నీవు ప్రసరించిన 
మంచు కన్నా చల్లనైన ఆ చూపుల చిరు జల్లులు,
మరచిపోని ఒక ఆ అంతరిక్ష యానం

నీతో కలిసి కార్యాలయ వృత్తి నిర్వహణలో 
సంవత్చరాలనేకం క్షణాల్లా గడచిన కాలం ...

నా చిన్న కవితకు స్పందించి, అపూర్వంగా 
నువ్వు నా యెద ముంగిట్లో కురిపించిన
ఉత్తర ప్రోత్చాహకాలు చెరగని ముద్రలై నిలిచి, 
అజ్ఞాతంగానే ముగించిన మన కలం స్నేహం..
నా మదిలో భద్రమైన వైనం, 

ఒక చోట బడిలో, ఒక చోట గుడిలో, ఒక చోట తోటలో 
ఒక చోట సముద్రాల తీరాలకు ఆవల ఏచోట నైతేనేమి 
నీవు కనిపించిన ప్రతీచోట నీ తీవ్రమైన వీక్షణ భాణాలు సంధించి,
నన్ను నువ్వు నీ ప్రఘాడ ప్రేమాకర్షణ లో కి ఆహ్వానించినా... 

నువ్వు నాకు అరాధించడానికే కాని 
నిన్ను నేను అందుకోలేని అల్పున్ని , 
ఎందుకంటే జన్మ జన్మలకు సరిపడా 
ఒప్పందాలు కుదుర్చుకున్న,
ఒకరి సొమ్మయిన ఒక ఏడడుగుల 

బంధాన్నికప్పుకొని, 


నాకోసం కన్నుల్లో ఒత్తులేసుకొని 
ఎదిరి చూసే నా ప్రియ భాంధవి, 
కను సన్నలలో ఎల్ల వేళలా తచ్చాడే 
బంధీనైన ఒక ప్రేమికున్ని ... క్షమించు నేస్తమా ... 

 

--జయ రెడ్డి బోడ(అబుధాబి)
 

Back to Top