64 సబ్‌స్టేషన్స్ నిర్మించనున్న 'దెవా'
- March 26, 2016
దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ (దెవా) 131/11 కిలోవాట్ కెపాసిటీతో 64 సబ్ స్టేషన్స్‌ని రానున్న మూడేళ్ళలో నిర్మించనుంది. వీటి కోసం 6.7 బిలియన్ దిర్హామ్‌లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ నెట్‌వర్క్స్‌కి ఈ కొత్త స్టేషన్స్‌ని లింక్ చేయడం ద్వారా ఎఫీషియన్సీని పెంచాలనే ఉద్దేశ్యంతో ఈ ఇనీషియేట్ తీసుకున్నారు. పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో 'దెవా' ప్రజల అవసరాల్ని తీర్చడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దెవా ఎండీ మరియు సీఈఓ సయీద్ మొహమ్మద్ అల్ తాయెర్ మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిసిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, మిడిల్ ఈస్ట్‌లో యూఏఈ నెంబర్ 1 పొజిషన్‌లో ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థానం 4 అని చెప్పారు. లాంగ్ టెర్మ్ వ్యూహంతో సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ప్రజల అవసరాన్ని తీర్చాలనే సంకల్పంతో, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని ఆయన చెప్పారు. 2018 వేసవి నాటికి లక్ష్యాన్ని చేరతామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







