మెగాస్టార్ కూతురి విషయంలోనూ ఆగని విడాకుల రూమర్స్..

- January 18, 2022 , by Maagulf
మెగాస్టార్ కూతురి విషయంలోనూ ఆగని విడాకుల రూమర్స్..


ఈ మధ్య సెలబ్రిటీల పర్సనల్ విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా వారి వైవాహిక జీవితనికి సంబంధించిన పుకార్లు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

మొదట నాగ చైతన్య, సమంతాలు తాము విడిపోతున్నామంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ లు పెట్టారు. మా ఇరువురి సంతోషం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా వారు ప్రకటించారు. కానీ, మీడియా మాత్రం దీన్ని 4 నెలలు కావొస్తున్నా ఇంకా వదల్లేదు. ఇప్పటికీ వీరి విడాకులకు సంబంధించిన విషయాలపై వార్తలు రాస్తూనే ఉంది. ఇంటర్వ్యూలలో వారిపై దీనికి సంబంధించిన ప్రశ్నల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ధనుష్, సౌందర్య రజినీకాంత్ లు విడిపోతున్నామని చెప్పిన విషయంపై కూడా మీడియా కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టింది.

అయితే, సమంత‍ ‍‍- నాగచైతన్య, ధనుష్ – సౌందర్య తోనే ఈ వార్తలు ఆగిపోలేదు. ఇప్పుడు కళ్యాణ్ దేవ్ ని పెళ్లాడిన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విడాకుల దిశగా అడుగులు వేస్తున్నట్లు మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీజ ఇన్ స్టా హ్యాండిల్ టైటిల్ మారింది. శ్రీజ కళ్యాణ్ కాస్తా శ్రీజ కొణిదెలగా మారడంతో శ్రీజ పేరు గాసిప్స్ లో ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ ఈ విషయంపై శ్రీజ అధికారికంగా ఎక్కడా మాట్లాడలేదు. అయితే, మీడియా సెలెబ్రెటీల పర్సనల్ విషయాలపై ఫోకస్ పెట్టడం తగ్గిస్తే బావుంటుందని, వారికి వారి జీవితం ఉంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com