ఒమాన్ 'సిఎంవైయఫ్' వారి ఆధ్వర్యం లో ఘనంగా జరిగిన మెగా రక్తదాన కార్యక్రమం!
- March 27, 2016
రక్తదాతలకు పాదాభివందనాలు
శుక్రవారం జరిగిన మెగా రక్తదాన శిభిరం ఉహించిన దానికన్నా మెగా ఫ్యామిలీ అభిమానులు, ఉదారవాదులు, సామాజిక బాధ్యత ఉన్నవాళ్లు మరీ ముఖ్యముగా మా CMYF టీం ను ప్రేమించి ఆదరించి మాపైనున్న విశ్వాసముతో సుమారు "మూడు వందలు" పైగా ఔత్సాహికులు రక్తదానానికి వచ్చారు అంటే మా అందరుకు అంతకన్నా ఆనందము మరొకటి వుండదు.
మెగా పవర్ స్టార్ "రామ్ చరణ్" జన్మ దినం సందర్భముగా మెగా లెవెల్ లో తలపెట్టిన రక్తదాన శిభిరము వైభవముగా ఎక్కువమంది ఉత్సాహముగా పాల్గొన్నందుకు మీ అందరుకు పేరుపేరునా పాదాభివందనము తెలుపుతున్నాము.
మండుటెండలను లెక్కచేయక.....దూరభావమును కూడా పక్క్కన పెట్టి వందల కిలో మీటర్లనుంచి వచ్చి రక్త దాన శిభిరములో పాల్గొని మీ సామజిక బాధ్యతను మరోసారి నిర్వర్తించారు.
ఉదయము 8 గంటలకు మొదలైన రక్త దాన శిభిరము సాయంకాలము 5 గంటల వరకు నిర్విఘ్నముగా జరిగినందుకు CMYF కార్య కర్తలకు ఆనందము అవధులు దాటింది అని చెప్పాలి. అద్భుతముగా "రక్తపు చుక్క" ఆకారములో చేసిన కేక్ ను సీనియర్ మెగా అభిమాని సివిల్ ఇంజినీయర్ అయిన వెంగల భాస్కర్ (సిరిసిల్ల-కరీంనగర్-తెలంగాణా) తల్లి గారు అయిన "వెంగల కాన్తవ్వ" గారు "రామ్ చరణ్" ను మనసారా ఆశీర్వదించి కేక్ కట్ చేసి వేడుకను జయప్రదం చేసారు.
రక్తదాతలందరుకూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము
మీ (మా) చిరు మెగా యూత్ ఫోర్స్, మస్కట్ - ఒమాన్






తాజా వార్తలు
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!







