3 లైసెన్స్ లేని వర్క్ షాప్‌లు మూసివేత

- January 20, 2022 , by Maagulf
3 లైసెన్స్ లేని వర్క్ షాప్‌లు మూసివేత

కువైట్: ఫర్వానియా గవర్నరేట్‌లోని జ్లీబ్ అల్-షుయౌఖ్‌లో లైసెన్స్ లేని మూడు వర్క్ షాప్‌లను ఫర్వానియా మునిసిపాలిటీ మూసివేసింది. అలాగే రెండు ఆక్రమణలను కూడా తొలగించింది. ఆరోగ్య నిబంధనలకు సంబంధించి 44 నోటీసులు జారీ చేసింది. ఫర్వానియా మునిసిపాలిటీ శాఖలోని ఉల్లంఘనల తొలగింపు విభాగం అధిపతి ఫహద్ అల్-మువైజ్రీ మాట్లాడుతూ.. దుకాణ యజమానులు మునిసిపాలిటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రతను నిర్ధారించడానికి అన్ని నివారణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. క్షేత్ర పర్యటనలు కొనసాగుతాయని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com