జిల్లాకో విమానాశ్రయం.. సీఎం జగన్ సంచలన నిర్ణయం
- January 20, 2022
అమరావతి: ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం ఉండాలన్నది మంచి కాన్సెప్ట్ అన్నారు సీఎం జగన్. వన్ డిస్ట్రిక్ట్- వన్ ఎయిర్‌పోర్టు ఉండాలని సీఎం చెప్పారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని.. అన్ని జిల్లాల్లో ఒకే రకంగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు జగన్. పోర్టులు, ఎయిర్‌పోర్టులపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి పెట్టాలని, బోయింగ్ విమానాలు సైతం ల్యాండింగ్ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలని సీఎం చెప్పారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆరు విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలన్నారు. ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని.. నిర్వహణలో ఉన్న విమానాశ్రయంల విస్తరణ పనులను కూడా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలన్నారు సీఎం జగన్.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







