పాకిస్థాన్ వ్యక్తికి మరణశిక్ష విధించిన సౌదీ అధికారులు !
- March 27, 2016
ఓ మహిళను దోపిడీ చేసి, హత్య చేసిన కేసులో పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తికి సౌదీ అరేబియా అధికారులు మరణశిక్ష విధించారు. దీంతో ఈ ఏడాది ఆ దేశంలో మరణశిక్షకు గురైన వారి సంఖ్య 79కి చేరింది. వివరాల్లోకి వెళితే..జెద్దాలోని రెడ్సీ నగరంలో బంగ్లాదేశ్‌కు చెందిన హజార్ హుస్సేన్ అనే మహిళను దోపీడి చేసి, హత్య చేశారు. ఈ కేసులో పాక్‌కు చెందిన ఎలియాస్ ఇస్మాయిల్ అనే వ్యక్తి దోషిగా గుర్తించి మరణశిక్ష విధించారు అక్కడి అధికారులు. దీంతో ఆదివారం ఇస్మాయిల్‌కు ఈ శిక్షను అమలుచేశారు. సౌదీ అరేబియాలో 2016లో ఇప్పటివరకు 79మందికి మరణశిక్ష అమలుచేయగా. ఒక్క జనవరి 2 రోజునే 47మందికి శిక్ష అమలు చేశారు. 2015లో అక్కడ 153 మందికి మరణశిక్ష అమలుచేశారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







