'భోళాశంకర్' కొత్త షెడ్యూల్ ప్రారంభం
- January 21, 2022
హైదరాబాద్: రోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో స్టార్ హీరోలంతా ఇళ్ళకే పరిమితమైపోయారు. ప్రస్తుతం షూటింగ్స్‌కు హాజరవడం లేదు. మెగాస్టార్ చిరంజీవి సైతం తన సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనడం లేదు. అయితే తాజాగా ఆయన మళ్ళీ మేకప్ వేసుకున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘భోళాశంకర్’ చిత్రం కొత్త షెడ్యూల్ షూటింగ్ ఈ రోజే (శుక్రవారం) ప్రారంభమైనట్టు సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో 12 రోజుల పాటు టాకీని తెరకెక్కించబోతున్నారు. ఈ షెడ్యూల్లో చిరంజీవి, కీర్తి సురేశ్ తో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు.
కాఫీ షాప్ నేపథ్యంలో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. అజిత్ తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు ఇది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తి సురేశ్ చిరుకి చెల్లెలిగా మెప్పించబోతోంది.
తాజా వార్తలు
- యూఏఈ: లైసెన్స్ లేని సంస్థల నుండి గృహ కార్మికులను నియమించుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు
- సీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్‌పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ