భారత్ కరోనా అప్డేట్
- January 22, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్‌లో రోజురోజుకీ కరోనా కేసుల ఉధృతి పెరిగిపోతోంది. మరణాలు సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 3,37, 704 నమోదు కాగా.. కరోనా మరణాల సంఖ్య 488గా నమోదైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21,13,365 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 5.43 శాతంగా ఉన్న కరోనా యాక్టివ్ కేసులు 17.22 శాతానికి చేరుకున్నాయి. రోజువారీ కరోనా పాజిటివిటి రేటు కూడా పెరిగింది.
దేశంలో ఇప్పటివరకు 3,89,03,731 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 4,88,884 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో 93.31 శాతంగా కరోన రికవరీ రేటు నమోదైంది.. అలాగే శుక్రవారం ఒక్కరోజే కరోనా నుంచి 2,42,676 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,63,01,482 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10,050 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







