EDCIL లో ఉద్యోగాలు
- January 22, 2022
ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (EDCIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ మినీరత్నసంస్థ పదో తరగతి విద్యార్హత మొదలు పీహెచ్‌డీ ఆధారంగా ఉన్న పలు పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- వీటిలో సీనియర్ కన్సల్టెంట్లు (ఫైనాన్స్) – 02, కన్సల్టెంట్లు (10), ఐటీ మేనేజర్ (01), ఐటీ ఎగ్జిక్యూటివ్ (01), ఆఫీస్ మేనేజర్ (01), ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ (03), ఆఫీస్ బాయ్స్ (02) పోస్టులను భర్తీ చేయనున్నారు.
- పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ అడ్వాన్సడ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, ఎంఫిల్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నైపుణ్యాలు తప్పనిసరి.
ముఖ్యమైన విషయాలు..
- ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 25000 నుంచి రూ. 75000 వరకు చెల్లిస్తారు.
- దరఖాస్తుల స్వీకరణకు 07-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేయండి..
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







