2022 IPL వేలంలో 1,214 మంది ఆటగాళ్లు: BCCI
- January 22, 2022
ముంబై: ఐపీఎల్-2022 మెగా వేలం వచ్చే నెలలో జరగబోతుంది. ఇందుకోసం ఆటగాళ్ల పూర్తి జాబితా వచ్చేసింది. ఈ లీగ్ కోసం 1,214 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు కాగా 318 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. మొత్తం 10 జట్లు ఇందులోని అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు పోటీ పడతాయి.
రూ. 1.5 కోట్ల లిస్ట్...
అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ఆరోన్ ఫించ్, క్రిస్ లిన్, నాథన్ లియోన్, కేన్ రిచర్డ్‌సన్, జానీ బెయిర్‌స్టో, అలెక్స్ హేల్స్, ఇయాన్ మోర్గాన్, డేవిడ్ మలన్, ఆడమ్ మిల్నే, కోలిన్ మున్రో, జిమ్మీ నీషమ్, గ్లెన్ సౌత్ ఫిలిప్స్, షిమ్రాన్ హెట్మేయర్, జాసన్ హోల్డర్, నికోలస్ పూరన్.
రూ. 1 కోటి లిస్ట్...
పీయూష్ చావ్లా, కేదార్ జాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, టి నటరాజన్, మనీష్ పాండే, అజింక్యా రహానే, నితీష్ రాణా, వృద్ధిమాన్ సాహా, కుల్దీప్ యాదవ్, జయంత్ యాదవ్, మహ్మద్ నబీ, జేమ్స్ ఫాల్క్‌నర్, మోయిసెస్ హెన్రిక్స్, మార్నస్ లాబుస్‌చాగ్నే, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, డిఆర్సీ షార్ట్, ఆండ్రూ టై, డాన్ లారెన్స్, లియామ్ లివింగ్‌స్టోన్, టైమల్ మిల్స్, ఆలీ పోప్, డెవాన్ కాన్వే, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, మిచెల్ సాంట్‌రమ్, మిచెల్ మరాక్‌రామ్, , తబ్రైజ్ షమ్సీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, వనిందు హసరంగా, రోస్టన్ చేజ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్.
ఈ సారి వేలంలో టాప్ ఆటగాళ్లను దక్కించుకునేందుకు ప్రాంచైజీ యాజమాన్యాలు పోటీ పడుతున్నాయి. కాగా ఈ సారి కొత్తగా మరికొన్ని ప్రాంచైజీలు వస్తుండటంతో వేలం రసవత్తరంగా సాగనుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







