అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు చేసిన రాచకొండ పోలీస్
- January 22, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. చైన్ స్నాచర్లు గొలుసులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఎల్బీనగర్ సంతోషి మాత దేవాలయంలో జరిగిన చోరీ కేసును ఛేదించామన్నారు రాచకొండ కమిషనర్ మహేష్ భగత్. డిసెంబర్ 3, 4 తేదీలలో దేవాలయంలో అమ్మవారి నగలు చోరీ గురయ్యాయని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టాం.సీసీటీవీ కెమేరాలతో పాటు దర్యాప్తు చేపట్టాం అన్నారు. ఇది అంతరాష్ట్ర దొంగల పని అని గుర్తించామన్నారు.
ఐటి, సైబర్ క్రైమ్, స్పెషల్ టీమ్స్ తో గాలింపు చేపట్టాం. అంతరాష్ట్ర దొంగల ముఠా గ్యాంగ్ 5 సభ్యులను గుర్తించాం. ఇందులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసాము. ఈ గ్యాంగ్ లో గుంటూరు జిల్లా కు చెందిన పొన్నూరి చిన్న సత్యానంద్ అలియాస్ సతీష్. మాండ్ల నాగేందర్ మరో నిందితుడు పరారీలో ఉన్నారని మహేష్ భగత్ తెలిపారు.

మొత్తం 19 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నాం.నిందితుల నుండి 215 గ్రాముల బంగారం, ఒక కారు, ఒక బుల్లెట్ వాహనం.నిందితుల పై రెండు తెలుగు రాష్ట్రాల 10 కేసులు నమోదు అయ్యాయి.గతంలో నాలుగు దేవాలయాల్లో చోరీలు చేశారు. నిందితులు దేవలయాలతో పాటు హౌస్ బ్రోకింగ్, ఆటో మొబైల్స్ కేసులు కూడా ఉన్నాయని రాచకొండ సీపీ తెలిపారు.

తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







