డ్రోన్ల యాక్టివిటీని నిలిపివేసిన UAE

- January 23, 2022 , by Maagulf
డ్రోన్ల యాక్టివిటీని నిలిపివేసిన UAE

యూఏఈ: డ్రోన్‌లు, తేలికపాటి క్రీడా విమానాలతో సహా అన్ని ఫ్లయింగ్ కార్యకలాపాలను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. పౌర విమానయాన జనరల్ అథారిటీతో సమన్వయంతో సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అనుమంతిచిన ప్రాంతాల్లో ఈ క్రీడల ప్రాక్టీస్ ను పరిమితం చేయకుండా దీన్ని దుర్వినియోగం చేయడం, నిషేధించబడిన ప్రాంతాల్లో డ్రోన్ లను ఎగురవేయడం వంటి వాటిని ఇటీవల గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అసురక్షిత పద్ధతుల నుండి సంరక్షించడానికి, ఆస్తుల భద్రతను నిర్ధారించడానికి MOI, పౌర విమానయాన జనరల్ అథారిటీ కట్టుబడి ఉందన్నారు. అయితే, డ్రోన్‌లను ఉపయోగించి షూటింగ్ ఒప్పందాలు లేదా వాణిజ్య లేదా ప్రకటనల ప్రాజెక్ట్ ల కోసం అవసరమైన మినహాయింపులు, అనుమతులను తీసుకోవడానికి తప్పనిసరిగా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా కార్యకలాపాలను నిర్వహిస్తే, మార్గదర్శకాలను విస్మరిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని MOI స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com