భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- January 24, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది.కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో 3,06,064 కేసులు నమోదయ్యాయి.నిన్నటి కంటే ఈరోజు 27,469 కేసులు తక్కువగా నమోదుకావడం ఊరటనిచ్చేవిషయం.ఇక గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనాతో 439 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.ఇక, 24 గంటల్లో 2,43,495 మంది కోలుకున్నారు.దేశంలో ప్రస్తుతం 22,49,335 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.దేశంలో పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉంది.కేసులు కొంత మేర తగ్గుతున్నా పాజిటివిటీ రేటు భారీగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.గతంలో పాజిటివిటీ రేటు 5 శాతం మించితే కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసేవారు.కానీ, థర్డ్ వేవ్ సమయంలో అలాంటివి పెద్దగా కనిపించడంలేదు.కరోనా కేసులు పెరుగుతున్నా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నాయి.వారం రోజులపాటు మందులు వాడుతూ నిబంధనలు పాటిస్తే కరోనా నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







