ఇద్దరు భారతీయులను కాపాడిన కువైట్ పౌరుడు
- January 24, 2022
కువైట్: కోల్ హీటర్ నుండి వెలువడిన విషపూరిత వాయువులను పీల్చిన ఇద్దరు భారతీయ కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. కువైట్ సిటిజన్ గుర్తించి వారిని కాపాడాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శివార్లలోని తన ఫామ్‌హౌస్‌లో ఉన్న కువైట్ పౌరుడు, కార్మికులను పిలవడానికి ప్రయత్నించాడు. కార్మికులు సమాధానం చెప్పకపోవడంతో వారి గదిని పరిశీలించగా.. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గుర్తించారు. వారిద్దరినీ ఫర్వానియా ఆసుపత్రికి తరలించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర చలి నుంచి తప్పించుకునేందుకు కూలీలు తమ గదిలో కోల్ హీటర్ వినియోగించినట్టు గుర్తించారు. అగ్నిమాపక సర్వీస్ అధికారులు మూసివేసిన గదిలో కోల్ హీటర్‌ను ఉపయోగించడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. దాని నుంచి విషపూరిత పదార్థం వెలువడి మూసివేసిన గదిలో మరణానికి దారితీయవచ్చన్నారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







