ఇద్దరు భారతీయులను కాపాడిన కువైట్ పౌరుడు

- January 24, 2022 , by Maagulf
ఇద్దరు భారతీయులను కాపాడిన కువైట్ పౌరుడు

కువైట్: కోల్ హీటర్ నుండి వెలువడిన విషపూరిత వాయువులను పీల్చిన ఇద్దరు భారతీయ కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. కువైట్ సిటిజన్ గుర్తించి వారిని కాపాడాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..  శివార్లలోని తన ఫామ్‌హౌస్‌లో ఉన్న కువైట్ పౌరుడు, కార్మికులను పిలవడానికి ప్రయత్నించాడు. కార్మికులు సమాధానం చెప్పకపోవడంతో వారి గదిని పరిశీలించగా.. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గుర్తించారు. వారిద్దరినీ ఫర్వానియా ఆసుపత్రికి తరలించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర చలి నుంచి తప్పించుకునేందుకు కూలీలు తమ గదిలో కోల్ హీటర్ వినియోగించినట్టు గుర్తించారు. అగ్నిమాపక సర్వీస్ అధికారులు మూసివేసిన గదిలో కోల్ హీటర్‌ను ఉపయోగించడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. దాని నుంచి విషపూరిత పదార్థం వెలువడి మూసివేసిన గదిలో మరణానికి దారితీయవచ్చన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com