డ్రగ్స్ స్మగ్లింగ్ చేయాల్సిందిగా భార్యపై భర్త ఒత్తిడి

- January 24, 2022 , by Maagulf
డ్రగ్స్ స్మగ్లింగ్ చేయాల్సిందిగా భార్యపై భర్త ఒత్తిడి

బహ్రెయిన్: అరబ్ మహిళ ఒకరు తన భర్త తనను డ్రగ్స్ స్మగ్లింగ్ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారంటూ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి తెలిపారు. బట్టల మాటున డ్రగ్స్ దాచి స్మగ్లింగ్ చేయాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని హై క్రిమినల్ కోర్టు ముందు ఆమె వాపోయారు. కాగా, కింగ్ ఫహాద్ కాజ్‌వే వద్ద ఇద్దరు నిందితుల్ని డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు చేశారు అధికారులు. వీరి వద్ద నుంచి 350 గ్రాముల హాషిష్ స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఆమె భర్తను సోదా చేయగా, ఎలాంటి డ్రగ్స్ లభించలేదు. అయితే, మహిళ ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుందన్న సమాచారంతో ఆమెను తనిఖీ చేయడగా డ్రగ్స్ బయటపడ్డాయి. బ్యాగులో ఏముందో తనకు తెలియదనీ, వాటిని దాచి పెట్టమని తన భర్త తనకు చెప్పాడని, తాను అందుకు అంగీకరించకపోగా తనను బెదిరించాడనీ ప్రాసిక్యూషన్ యెదుట మహిళ వివరణ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com