‘మేజర్’ సినిమా రిలీజ్ వాయిదా..
- January 24, 2022
హైదరాబాద్: అడివి శేష్ హీరోగా, ‘గూఢచారి’ ఫేం శశి కిరణ టిక్కా దర్శకత్వంలో, సూపర్‌స్టార్ మహేష్ బాబు GMB Entertainment బ్యానర్‌తో కలిసి ఏ ప్లస్ ఎస్, సోనీ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్న మూవీ ‘మేజర్’. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికలు.
26/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ముందుగా ఫిబ్రవరి 11న రిలీజ్ చెయ్యబోతున్నట్లు ప్రకటించారు. రీసెంట్గా విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.
కరోనా కారణంగా, దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆంక్షల నేపథ్యంలో ‘మేజర్’ సినిమాని వాయిదా వేసినట్టు తెలిపారు.ఈ సినిమాలో మిలటరీ అధికారిగా కనిపించడానికి కఠినమైన వర్కౌట్స్ చేసి బరువు తగ్గాడు శేష్. తెలుగుతో పాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ‘మేజర్’ లో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన







