ఏపీలో కరోనా ఉగ్రరూపం..
- January 24, 2022
అమరావతి: ఏపీలో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది.రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి కొత్త కేసులు భారీగా సంఖ్యలో వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 14వేల 502 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.మరో ఏడుగురు కోవిడ్ తో చనిపోయారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు చనిపోయారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. మరోవైపు 4వేల 800 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 93వేల 305 యాక్టివ్ కేసులు ఉన్నాయి.తాజాగా నమోదైన వాటిలో విశాఖలో అత్యధికంగా 1728 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 1610 కేసులు వెలుగుచూశాయి.కాగా, రాష్ట్రంలో నిన్న 14వేల 440 కేసులు నమోదవగా.. ఇవాళ ఆ సంఖ్య మరింత పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,95,136 కి చేరింది.అదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,87,282గా ఉంది. గడిచిన 24 గంటల్లో 40వేల 266 కరోనా టెస్టులు చేశారు.ఇప్పటివరకు రాష్ట్రంలో 3,21,87,297 కోవిడ్ టెస్టులు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







