న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌ల పై ఆగ్రహించిన ఏపీ హైకోర్టు
- January 25, 2022
అమరావతి: న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లను వెంటనే తొలగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో జరిగిన దూషణలపై సీబీఐ చేస్తున్న దర్యాప్తుపై హైకోర్టులో విచారణ జరిగింది. తాము లేఖలు రాసినా.. ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్ పట్టించుకోలేదని.. సీబీఐ.. హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ లేఖ రాస్తే హైకోర్టు ఉత్తర్వులుగానే పరిగణించాలని ఆదేశించింది. సీబీఐ, హైకోర్టు రిజిస్ట్రార్ లేఖలకు ఎందుకు స్పందించలేదని.. సోషల్ మీడియా ఫ్లాట్‌పామ్‌లను హైకోర్టు ప్రశ్నించింది. కేసు విచారణ ఈనెల 31కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







