తెలంగాణ కరోనా అప్డేట్
- January 25, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 4వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,13,670 కరోనా టెస్టులు చేయగా.. 4,559 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో ఇద్దరు కోవిడ్ తో మరణించారు. అదే సమయంలో 1,961 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 36వేల 269కి పెరిగింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.55శాతం ఉండగా.. రికవరీ రేటు 94.57శాతంగా ఉంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
కొత్తగా నమోదైన కొవిడ్ కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 1,450 పాజిటివ్ కేసులు బయటపడగా.. మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లాలో 432, రంగారెడ్డి 322, హనుమకొండ 201, ఖమ్మం 145, కరీంనగర్ 112, నల్గొండ జిల్లాలో 138 కొత్త కేసులు వచ్చాయి.నిన్న 3వేల 980 కరోనా కేసులు నమోదవగా.. ఈరోజు అంతకుమంచి పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురి చేస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







