ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- January 25, 2022
అమరావతి: ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కొత్త జిల్లాల వివరాలను ప్రభుత్వం మంత్రులకు పంపింది. ఆన్ లైన్ లో సమావేశమైన మంత్రివర్గం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
దీంతో ఏపీలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా 13 జిల్లాలు ఆవిర్భవించనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకి సంబంధించి ప్రణాళిక కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక అందించారు. కేబినెట్ ఆమోదంతో ప్రభుత్వం త్వరలోనే కొత్త జిల్లాల ఏర్పాటుకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనుంది.
కేబినెట్ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో లోక్ సభ నియోజకవర్గాల ప్రాతిపదికన 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. 2019 ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక్కో జిల్లాగా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అన్ని పనులు ముగిశాయని, సరిహద్దులు అన్నింటిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడక్కడ భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చిన్న చిన్న మార్పులు- చేర్పులు ఉంటాయని సమాచారం. ఇక, అధికారికంగా నోటిఫికేష్ ఇవ్వడం మాత్రమే మిగిలి ఉంది.
పెరిగిన జనాభాకు అనుగుణంగా పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలంటే..ఇప్పుడున్న జిల్లాలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమని ఇంతకు ముందే వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







