‘కొండా’ ట్రైలర్ విడుదల
- January 26, 2022
వరంగల్: సెన్సేషన్ డైరెక్టర్ ఆర్జీవీ ఇటీవల రాజకీయాల్లోని చాలా మంది బయోపిక్స్ ని ఒక్కొక్కటిగా తెరకెక్కిస్తున్నారు. ఆర్జీవీ ఇటీవల తెలంగాణ నాయకుడు కొండా మురళి బయోపిక్ ని అనౌన్స్ చేశాడు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ సినిమా ఆసక్తిగా మారింది. గతంలో ఆర్జీవీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ”నేను మాఫియా, ఫ్యాక్షనిజం, రౌడీయిజంపై సినిమాలు తీసాను కానీ తెలంగాణ నక్సలైట్, మావోయిస్టుల గురించి తీయలేదు. ఇప్పుడు కొండా మురళి బయోపిక్ తో అది కూడా పూర్తవుతుంది” అని తెలిపారు. కొండా మురళి, కొండా సురేఖల నేపథ్యంలోంచి తెలంగాణ రాజకీయాలని, సాయుధ పోరాటాలని ”కొండా” సినిమాలో తెరకెక్కించారు.
తాజాగా ఇవాళ జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ‘కొండా’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ కంటే ముందే ఈ సినిమాలో కథేంటో ఒక వీడియోతో చెప్పి ట్రైలర్ కంటే ముందే రిలీజ్ చేశారు. తాజాగా ‘కొండా’ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇందులో కొండా మురళి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగాడు? సురేఖతో ప్రేమ? సురేఖ కొండా మురళికి ఎలా సపోర్ట్ చేసింది? కొండా మురళి మీద జరిగిన హత్యాయత్నం, నక్సలైట్ల నేపథ్యం… ఇలాంటి అంశాలన్నీ చూపించినట్లు తెలుస్తుంది.
ట్రైలర్ లో ఆర్జీవీ మార్క్ కనపడింది. చివరగా నా పేరు కొండా మురళి అంటూ ఈ ట్రైలర్ ని ముగించాడు. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. తెలంగాణ రాజకీయ నేపథ్యం, తెలంగాణ నక్సలైట్లు, మావోయిస్టుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండటంతో ఈ సినిమాపై తెలంగాణలో మరింత ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







