మనదేశపు జెండా

- January 26, 2022 , by Maagulf
మనదేశపు జెండా

అదిగో అదిగో ఎగురుతుంది మన జెండా 
మువ్వన్నెల ముచ్చటైన శాంతికపోతం మన జెండా 
దేశసమైక్యత సమగ్రత సామరస్యంతో  మన జెండా 
ధన మాన ప్రాణాలని పణంగా పెట్టి పోరాటం చేసిన 
ఎందరో మహనీయుల త్యాగఫలం మన జెండా 
స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఆత్మగౌరవాన్ని 
కాపాడుతూ పౌరులందరికి హక్కులు కలిపించిన 
భరతమాతని దాస్య శృంఖలాల నుంచి విడిపించిన 
ఆంగ్లేయులని తరిమికొట్టిన భారతీయత మన జెండా 
సర్వసత్తాక సార్వభౌమ రాజ్యంగమే మన గణతంత్ర దినోత్సవం అమలు చేసిన సుదినం చరిత్రలో నిలిచిపోయే 
వీరనారీమణులు మహత్ములు నడయాడిన వేదభూమి
సాహసబాలలని ప్రతిభని గుర్తించి ప్రశంసల జల్లులు
కురిపించి వివిధ విభాగాల్లో విద్య వాణిజ్యం సాహిత్యం సంగీతం ఆధ్యాత్మిక వేత్తలని అత్యంత గౌరవపూర్వకంగా సన్మానించే సుదినం  ఈరోజు  అందంగా ముస్తాబై రెపరెపలాడుతూ  చిరునవ్వులు చిందించే  మనజెండా 
ఆశయసాధనలో ముందు తరాలకి ఆదర్శంగా నిలబడి
ప్రతి పౌరుడిలో దేశభక్తిని చాటి చెపుతూ నరనరాల్లో 
యువత గుండెల్లో ఉప్పొంగే రక్తంతో దేశ ప్రగతికి 
పాటుపడుతూ కులమత వర్గవైషమ్యాలు విడనాడి
భాషలు వేరైనా జాతులు వేరైనా మనమంతా ఒకటేనని 
ఒకరికి ఒకరు అనే మైత్రీ భావం చాటిన మన జెండా 
నవసమాజ నిర్మాణంలో ప్రపంచ దేశాలన్నిటిలో 
అతిపెద్దది పవిత్రమైన సుదీర్ఘమైన గ్రంధం లిఖిత పూర్వక రాజ్యంగం అందించిన మహనీయులని స్మరించుకుందాం. 
జేజేలు పలుకుతూ వందేమాతరం వందేమాతరం అనే నినాదం తో గళం గళం కలిపి ఎలుగెత్తి పాడుదాం...

--యామిని కొళ్లూరు(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com