రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆకట్టుకున్న త్రివిధ దళాలు

- January 26, 2022 , by Maagulf
రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆకట్టుకున్న త్రివిధ దళాలు

న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ముందుగా రాజ్‌పథ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌..

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం 155 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన నాలుగు హెలికాప్టర్లు వైన్ గ్లాస్ ఫార్మేషన్‌ను ప్రదర్శించారు. అనంతరం వివిధ బలగాల మార్చ్‌ఫాస్ట్ జరిగింది.

ఆ తర్వాత శకటాల ప్రదర్శన మొదలైంది. ఈ ప్రదర్శనలు భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ శకటాలు ఆకట్టుకున్నాయి. ఆర్మీ శకటాల్లో సెంచూరియన్ ట్యాంక్‌, పీటీ-76, ఎంబీటీ అర్జున్ ఎంకే-1, ఏపీపీ టోపాజ్ యుద్ధ ట్యాంకులను, స్వదేవీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హవిట్జర్ ఎంకే-1 గన్ సిస్టమ్‌ను ప్రదర్శించారు. ఇండియన్ నేవీ శకటంలో నేవీకి చెందిన వివిధ సామర్థ్యాలను తెలియజేసే నమూనాలను ప్రదర్శనకు పెట్టారు.

ఆ తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ శకటం పరేడ్‌లోకి వచ్చింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఫర్ ది ఫ్యూచర్ అనే థీమ్‌ను ఈ శకటం ప్రదర్శించింది. ఈ శకటంపై మింగ్‌-21, గ్నాట్‌, లైట్ కంబాట్ హెలికాప్టర్‌, అశ్లేష రాడార్‌, రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్ నమూనాలను ప్రదర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com