జిసిసిలో తొలిసారిగా కాసినో ప్రారంభించనున్న యూఏఈ
- January 26, 2022
యూఏఈ: హోటల్ మరియు కాసినో నిర్వాహణలో పేరున్న వియాన్ రిసార్ట్స్, త్వరలో రస్ అల్ ఖైమాలో లగ్జరీ రిసార్టుని నిర్మించనుంది. గేమింగ్ ఏరియాతో దీన్ని ఏర్పాటు చేస్తారు. తొలిసారిగా ఓ ముస్లిం గల్ప్ దేశంలో గ్యాంబ్లింగ్కి దీని ద్వారా లైన్ క్లియర్ అయినట్లు భావించాలి. గేమింగ్తోపాటుగా గ్యాంబ్లింగ్ కూడా వుంటుందా.? లేదా.? అన్నదానిపై వియాన్ సంస్థ స్పష్టత ఇవ్వాల్సి వున్నా, వినోదానికి సంబంధించి నిబంధనల్లో ఖచ్చితంగా మార్పులు రాబోతున్నాయని రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ పేర్కొంది. ఈ మేరకు కొత్త డిపార్టుమెంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మరియు గేమింగ్ రెగ్యులేషన్ని కూడా ఏర్పాటు చేశారు. టూరిజం మరియు బిజినెస్ హబ్గా వున్న యూఏఈలో ఈ గ్యాంబ్లింగ్ గేమింగ్ సరికొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టనుంది. 2026 నాటికి వియాన్ సంస్థ ఈ వినోద కేంద్రాన్ని పూర్తి చేయనుంది. మానవ నిర్మిత ఐలాండ్ అల్ మర్జాన్లో దీన్ని ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







