తలనొప్పిగా మారిన ఓమిక్రాన్...వేటిపై ఎంతసేపు ఉంటుందో చూడండి..
- January 26, 2022
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్ని కుదిపేస్తున్న ఓమిక్రాన్ వైరస్ పై పలు అధ్యయనాలు సాగుతున్నాయి. ఇందులో పలు కొత్త కొత్త అంశాలు కూడా వెలుగుచూస్తున్నాయి.
ఇందులో ప్రధానంగా ఓమిక్రాన్ వైరస్ మనిషి శరీరంపై ఎంత కాలం ఉంటుందనే దానిపై కొత్త అంశాలు బయటపడ్డాయి.
గతంలో వెలుగుచూసిన అన్ని వైరస్ లకు భిన్నంగా ఒమిక్రాన్ వైరస్ మనిషి శరీరంపై 21 గంటల పాటు స0జీవంగా ఉంటుందని తాజాగా ఓ అధ్యయనంలో నిర్ధారణ అయింది. అలాగే ప్లాస్టిక్ పై 8 రోజుల పాటు ఉంటుందని తేలింది. దీంతో ఓమిక్రాన్ వైరస్ ప్రభావం ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గతంలో బయటపడిన కరోనా వైరస్ వేరియంట్లేవీ ఇంత ఎక్కువ సమయం మనిషి శరీరంపై కానీ, ప్లాస్టిక్ పై కానీ లేవని వెల్లడైంది. ఇతర జాతులతో పోలిస్తే ఇది వేగంగా వ్యాపించడానికి ఇదే కారణమని ఈ అధ్యయనం పేర్కొంది.
జపాన్‌లోని క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వుహాన్‌లో వెలుగుచూసిన SARS-CoV-2 జాతి , మిగతా అన్ని రకాల మధ్య వైరల్ పర్యావరణ స్థిరత్వంలో తేడాలను విశ్లేషించారు. ఇందులో కరోనా జాతుల్లో అధిక పర్యావరణ స్థిరత్వం వ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతుందని, అధ్యయనం రచించిన రచయితలు చెప్పారు. ఈ జాతుల్లో ఓమిక్రాన్ అత్యధిక పర్యావరణ స్థిరత్వాన్ని కలిగి ఉందని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఇది డెల్టా వేరియంట్‌ను భర్తీ చేయడానికి, వేగంగా వ్యాప్తి చెందడానికి వేరియంట్‌ను అనుమతించిన కారకాల్లో ఒకటి కావచ్చని వారు విశ్లేషించారు.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం







