ఏపీ కరోనా అప్డేట్
- January 26, 2022అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. టెస్ట్‌ల సంఖ్య 50వేల లోపుగానే ఉన్నా.. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 14 వేలకు చేరువగా వెళ్తోంది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49,143 శాంపిల్స్ పరీక్షించగా 13,618 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 9 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖలో ఇద్దరు చొప్పు, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు మరణించారు.. ఇక, ఇదే సమయంలో.. 8,687 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొన్న ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,22,83,369కు చేరగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,22,573కి, పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 21,01,685కి, మృతుల సంఖ్య 14,570కి పెరిగింది.. ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షను దాటేసి.. 1,06,318గా ఉంది.. తాజా కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నంలో 1,791, అనంతపురంలో 1,650, గుంటూరులో 1,464, కర్నూలులో 1,409, ప్రకాశం జిల్లాలో 1,1295 కేసులు వెలుగు చూశాయి.
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!