వారం పాటు మెగా సేల్‌ కార్నివాల్‌ : ఎయిర్‌ ఏషియా

- March 28, 2016 , by Maagulf
వారం పాటు మెగా సేల్‌ కార్నివాల్‌ :  ఎయిర్‌ ఏషియా

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా, ఎయిర్‌ ఏషియా ఎక్స్‌ వారం పాటు మెగా సేల్‌ కార్నివాల్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి ఏప్రిల్‌ 3 వరకు అతి తక్కువ ధరలకే ప్రయాణికులకు విమానయాన సౌకర్యాన్ని కల్పిస్తోంది. డొమెస్టిక్‌ విమాన సర్వీసులకు రూ.1,099, అంతర్జాతీయ విమాన సర్వీసులను రూ.2,999 కనీస టికెట్‌ ధరను నిర్ణయించింది. ఈ మెగాసేల్‌లో టికెట్లు కొనుక్కున్న ప్రయాణికులు జూన్‌ 1 నుంచి నవంబర్‌ 24 లోపల ఎప్పుడైనా ప్రయాణించవచ్చు.ఈ సందర్భంగా ఎయిర్‌ఏషియా చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ తేహ్‌ మాట్లాడుతూ ఈ మెగా సేల్‌ ద్వారా 22 దేశాల్లోని 100 గమ్యస్థానాల్లో ఎక్కడికైనా ప్రయాణించవచ్చన్నారు.
జైపూర్‌, కొచ్చి, పుణె, వైజాగ్‌, గువాహటి, బెంగళూరు, న్యూదిల్లీ ఒక సారి వెళ్లడానికి రూ.1,099 టికెట్‌ ధరగా నిర్ణయించారు. కొచ్చి నుంచి బెంగళూరుకి రూ.2,999, బాలి రూ.6,299, సింగపూర్‌ రూ.5,899, మకావు రూ.9,299, ఫుకెట్‌ రూ.7,799, పెర్త్‌ రూ.13,399గా నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com