అనసూయ కు తలనొప్పి తెచ్చిపెట్టిన 'వందేమాతరం' గేయం..అసలేం జరిగిందంటే..
- January 27, 2022
హైదరాబాద్: సోషల్‌మీడియా యూజర్లకు నటి అనసూయ క్షమాపణలు చెప్పారు. తన డే టు డే లైఫ్ గురించి తరచూ సోషల్‌మీడియాలోని నెటిజన్లతో ముచ్చటించే ఆమె బుధవారం ఉదయం దేశప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మన జాతీయ గేయమైన 'వందేమాతరం' ఆలపిస్తూ ఓ వీడియోను షేర్ చేసి.. రిపబ్లిక్ డే విషెస్ చెప్పారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. ''మేడమ్ ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం కాదు.. గణతంత్ర దినోత్సం. మీరు వేసుకున్న షర్ట్‌పై మహాత్మా గాంధీ బొమ్మ ఉంది. గాంధీకి గణతంత్ర దినోత్సవానికి సంబంధం ఏమిటి?'', ''మీరు కూర్చొని ఈ పాట పాటడం ఏం బాలేదు. కొంచెం నిల్చొని పాట పాడుంటే హుందాగా అనిపించేది. ఇలా చెప్పినందుకు మీరు ఫీలై ఉంటే క్షమించండి'' అని నెటిజన్ల నుంచి వరుస కామెంట్లు వచ్చాయి.
ఆ కామెంట్లపై స్పందించిన అనసూయ..''మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిల్చొని పాట పాడనందుకు చాలామంది అసహనానికి లోనైనట్లు ఉన్నారు. అందుకు నన్ను క్షమించండి. జాతీయ గీతమైన 'జనగణమన'కు లేచి నిల్చుటాం.. తద్వారా దేశంపట్ల మన గౌరవాన్ని చాటుతాం. కానీ, నేను ఆలపించింది జాతీయ గేయమైన వందేమాతరం.. దాన్ని మీరందరూ గమనించాలి. నా దేశం పట్ల నాకెంతో గౌరవం ఉంది'' అని ఆమె రిప్లై ఇచ్చారు. అనసూయ సమాధానమిచ్చినప్పటికీ నెగటివ్ కామెంట్లు ఆగకపోవడంతో ఆమె అసహనానికి గురయ్యారు. ''అరేయ్ ఎందిరా భయ్ మీ లొల్లి.. జాతీయ గేయం అంటారు.. గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటి? అంటారు.. వందేమాతరాన్ని జాతీయ గీతం అనుకుంటే మరి జనగణమన ఏంది? ఆగస్టు 15, 1947 స్వాతంత్ర్యం రాబట్టే జనవరి 26, 1950లో గణతంత్ర దినోత్సవం వచ్చింది. కాబట్టి కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకుని మాట్లాడండి'' అని కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







