కరోనా మాస్క్ ఆంక్షలు ఎత్తివేసిన బ్రిటన్

- January 28, 2022 , by Maagulf
కరోనా మాస్క్ ఆంక్షలు ఎత్తివేసిన బ్రిటన్

లండన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఓమిక్రాన్ తీవ్ర రూపం దాల్చుతున్న సమయంలో పలు దేశాల్లో కరోనా ఆంక్షలు కఠినతరం చేస్తుండగా.. బ్రిటన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా ఆంక్షలు సడలిస్తూ బ్రిటన్ ప్రభుత్వం దేశ ప్రజలకు పలు సూచనలు చేసింది. ఇకపై కరోనా మాస్క్ ధరించాల్సిన అవసరంలేదని, బయట తిరిగేందుకు కోవిడ్ వాక్సిన్ సర్టిఫికెట్ కూడా అవసరం లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జూన్సన్ గురువారం వెల్లడించారు. కరోనా బూస్టర్ డోసు.. ఓమిక్రాన్ సహా అన్ని వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేయడంతో పాటు.. ప్రాణాపాయస్థితిని, ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరాన్ని తప్పించిందని.. ఈక్రమంలో కరోనా ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రధాని బోరిస్ జూన్సన్ తెలిపారు.

ఇదిలా ఉంటే.. బ్రిటన్ లో నిత్యం లక్షకు పైగా ఓమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం కరోనా ఆంక్షలు ఎత్తివేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోవిడ్-19ను ఇకపై “సీజనల్ ఫ్లూ”గా పరిగణిస్తూ.. ముందస్తుగా వ్యాక్సిన్ తీసుకోవాలని దేశ ప్రజలకు ప్రభుతం సూచించింది. ఇక ఇంటి నుంచే పని, విద్యాసంస్థలు, బస్సులు, రైళ్లలో ఫేస్‌ మాస్కులను ధరించాల్సిన అవసరం లేదని జనవరి మూడో వారంలోనే ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో అందరికి బూస్టర్ డోసులు పంపిణీ చేయాలని డిసెంబర్ నుంచే ప్రణాళిక సిద్ధం చేయగా.. ఆమేరకు వాక్సిన్ పంపిణీ వేగంగా సాగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com