తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ హాజరైన హెల్త్ డైరెక్టర్
- January 28, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మూడో దశను అరికట్టేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై మరోమారు విచారణ చేపట్టింది ధర్మాసనం. కరోనా ఉదృతంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆంక్షలపై పూర్తి వివరాలతో ప్రత్యక్ష విచారణకు హాజరుకావాలంటూ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ను హైకోర్టు గతవారం ఆదేశించింది. ఈమేరకు శుక్రవారం జరిగిన విచారణకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆన్ లైన్ ద్వారా విచారణకు హాజరైయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వ న్యాయవాది ఆధ్వర్యంలో హైకోర్టుకు వివరించారు.
విచారణలో భాగంగా పలు విషయాలను హైకోర్ట్ అడిగి తెలుసుకుంది. జనవరి 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. వైద్య కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవన్న పిటిషన్ తరుపు న్యాయవాదుల ప్రశ్నకు.. డీహెచ్ శ్రీనివాస్ బదులిస్తూ పిల్లలకు మందులు కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉన్నట్లు పేర్కొన్న శ్రీనివాస్.. ఆంక్షలు విధించాల్సిన అవసరం రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 77 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే చేసి లక్షణాలు ఉన్న బాధితులకు 3.45 లక్షల కిట్లు పంపిణీ చేసినట్లు డీహెచ్ శ్రీనివాస్ హై కోర్టుకు నివేదించారు. ఇక ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం..కరోనా సమయంలో సమ్మక్క జాతర ఏర్పాట్లు, వారాంతవు సంతల్లో కోవిడ్ జాగ్రత్తలు, పాఠశాలల ప్రారంభంపై మూడు రోజుల్లోగా పూర్తి నివేదికతో రావాలని హెల్త్ డైరెక్టర్ ను ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!