స్నాప్ చాట్ ద్వారా డూప్లికేట్ వస్తువుల విక్రయం: సౌదీ వ్యక్తి అరెస్టు

- January 29, 2022 , by Maagulf
స్నాప్ చాట్ ద్వారా డూప్లికేట్ వస్తువుల విక్రయం: సౌదీ వ్యక్తి అరెస్టు

సౌదీ: సౌదీ అథారిటీస్, ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని అరెస్టు చేశారు. తన స్నాప్ చాట్ అకౌంట్ ద్వారా డూప్లికేట్ వస్తువుల్ని నిందితుడు విక్రయిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. రెండు లగ్జరీ అపార్టుమెంట్లను నిందితుడు అద్దెకు తీసుకున్నాడనీ, అలాగే లగ్జరీ కార్లను లీజుకి తీసుకున్నాడనీ, తద్వారా తన ఫేమ్ పెంచుకునేందుకు ప్రయత్నించాడనీ, ఆ తర్వాత డూప్లికేట్ వస్తువల్ని విక్రయించడం చేశాడని మినిస్ట్రీ పేర్కొంది. 700,000 సౌదీ రియాల్స్ విలువైన ఫేక్ గూడ్స్ నిందితుడి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. బ్యాగులు, వ్యాలెంట్లు, యాక్సెసరీస్, ప్యాకేజింగ్ పేపర్లు మరియు సాపింగ్ బ్యాగుల్ని స్వాధీనం చేసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com