తెలంగాణ కరోనా అప్డేట్
- January 30, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా విస్తరిస్తూనే ఉంది. ప్రతి రోజు పాజిటివ్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికమౌతోంది. వివిధ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.కరోనా వేరియంట్ తో పాటు ఒమిక్రాన్ కూడా భయపెడుతోంది. అయితే.. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య 3 నుంచి 4 వేల వరకు నమోదవుతున్నాయి. తాజాగా..ఈ సంఖ్య తగ్గింది. బుధవారం 3 వేల 801, గురువారం 3 వేల 944 పాజిటివ్ కేసులు ఉంటే.. శుక్రవారం 3 వేల 877 కేసులు,శనివారం 3 వేల 590 మంది కరోనా బారిన పడ్డారు. గత 24 గంటల్లో 2 వేల 484 మందికి వైరస్ సోకిందని, ఒక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. మొత్తం 4 వేల 086 మంది చనిపోయారని పేర్కొంది. అలాగే…ఒక్కరోజులో 4 వేల 207మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,18,241గా ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







