బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు:మోడీకి కేటీఆర్ ట్వీట్
- January 30, 2022
హైదరాబాద్: పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారని, ప్రతి భారతీయుడికి ఇల్లు నిర్మించి ఇస్తామని గతంలో కేంద్రం ఇచ్చిన హామీలను మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు. ఇంటింటికీ నీరు, విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అంతే కాకుండా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని కేటీఆర్ కోరారు. హామీలకు న్యాయం చేసేలా బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







