శంషాబాద్ లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం
- January 30, 2022
హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పెద్ద షాపూర్ వద్ద నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, త్రిదండి శ్రీ మన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు.
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, ఎంపీ రంజిత్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు పి.మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, జెడ్పి చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా 7వందల కోట్ల రూపాయలను కేటాయించారని, 28 వేల పోలీస్ పోస్టులను భర్తీ చేశారని వివరించారు. ఎప్పుడు లేని విధంగా 33 శాతం మహిళా సిబ్బంది పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏడు లక్షల సిసి కెమెరాల ద్వారా నిత్యం శాంతిభద్రతల పర్యవేక్షణ ఉంటుందని, 26 జిల్లా పోలీసు కార్యాలయం అత్యద్భుతంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సిద్దిపేటలో అత్యాధునిక కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ, సైబర్ నేరాలను అరికడుతున్నట్టు తెలిపారు. లండన్, అమెరికాకు ఏ మాత్రం తీసిపోకుండా నాణ్యమైన సేవలు నిర్వహిస్తున్నామని వివరించారు. రౌడీయిజాన్ని కంట్రోల్ లో పెట్టి అవసరమైతే పిడి యాక్టులు నమోదు చేశామని తెలిపారు. శాంతిభద్రతలను కాపాడడంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ భవనం, సిబ్బందికి క్వార్టర్స్ కూడా త్వరలో నిర్మించేందుకు ప్రణాళికలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే పాస్ పోర్టులు లభిస్తున్నాయని తెలిపారు. జెపి దర్గా వద్ద ఔట్ పోస్ట్ ఏర్పాటు అవుతుందని తెలిపారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమానికి మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు పి.మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, జెడ్పి చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, స్థానిక జెడ్పిటిసి, ఎంపీపీ, ఎంపీటీసీలు తదితరులు హాజరయ్యారు.
--శ్రీనివాస్ మంచర్ల(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







