‘కే3 కోటికొక్కడు’ ఫిబ్రవరి 4న గ్రాండ్ రిలీజ్ కు సన్నాహాలు
- January 31, 2022
బెంగుళూరు: తెలుగు ప్రేక్షకులకు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సుదీప్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కే3 కోటికొక్కడుతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నారు. శివ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
కన్నడలో కే 3 చిత్రం విడుదలై ట్రేడ్ లెక్కల ప్రకారం రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు చేసి సుదీప్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ఫిబ్రవరి 4న గ్రాండ్ గా విడుదలచేయనున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన కే3 కోటికొక్కడు ట్రైలర్ లో సుధీప్ రెండు విభిన్న పాత్రల్లో మెప్పించారు. మడోన్నా సెబాస్టియన్ సుదీప్ జోడి చూడముచ్చటగా ఉంది. ట్రైలర్‌లో శ్రద్దా దాస్, రవి శంకర్, నవాబ్ షా తదితరులు కనిపించారు. యాక్షన్ ప్యాక్ డ్ గా రిలీజైన కే3 కోటికొక్కడు తెలుగు ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.గుడ్ సినిమా గ్రూప్ సంస్థ కే3 కోటికొక్కడు చిత్రాన్ని ఫిబ్రవరి 4న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







