5,000 దిర్హామ్‌లను తిరిగిచ్చిన ఆసియన్.. సత్కరించిన దుబాయ్ పోలీసులు
- February 01, 2022
దుబాయ్: 5,000 దిర్హామ్‌లను తిరిగిచ్చినందుకు దుబాయ్ పోలీసులు ఆసియన్‌ను సన్మానించారు. అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికిన 5,000 దిర్హామ్ ల నగదును ఒక ఆసియా జాతీయుడు అబ్దుల్‌సబూర్ చౌదరి ముహమ్మద్ పోలీసులకు అందజేశారు. అతని నిజాయితీని మెచ్చిన బ్రిగేడియర్, అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్ యాక్టింగ్ డైరెక్టర్ అబ్దుల్‌హలీమ్ ముహమ్మద్ అహ్మద్ అల్ హషిమి అతన్ని సత్కరించారు. ఈ సందర్భంగా అల్ హషిమి మాట్లాడుతూ.. ప్రజలు, పోలీసులు సహకార ప్రాముఖ్యతను తెలియజేశారు. కమ్యూనిటీ భాగస్వామ్యం, సామాజిక బాధ్యత భావనను బలోపేతం చేయడానికి దుబాయ్ పోలీసులు కృషి చేస్తున్నారన్నారు. నిజాయితిని చాటుకున్న ముహమ్మద్‌కు రివార్డ్ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. తనను గౌరవించినందుకు దుబాయ్ పోలీసులకు ముహమ్మద్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







