ముంబయి షూటింగ్ షెడ్యూల్లో తీసిన ఫొటోలు
- March 29, 2016కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రం సెట్లో తీసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తారక్ అభిమానులు ఫేస్బుక్ ద్వారా ఈ స్టిల్స్‌ను పంచుకున్నారు. 'జనతా గ్యారేజ్' ముంబయి షూటింగ్ షెడ్యూల్లో తీసిన ఫొటోలుగా వీటిని పేర్కొన్నారు. ఇందులో ఎన్టీఆర్ గడ్డంతో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు.ఈ చిత్రంలో సమంత, నిత్యా మేనన్‌లు కథానాయికలు. మళయాళ నటుడు మోహన్ లాల్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.మైత్రి మూవీస్ మేకర్స్ పతాకంపై యెర్నేని నవీన్, వై. రవిశంకర్, సి.వి. మోహన్‌లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..