ప్రయాణ నిబంధనలు సడలించిన యూఏఈ

- February 05, 2022 , by Maagulf
ప్రయాణ నిబంధనలు సడలించిన యూఏఈ

యూఏఈ: పూర్తి డోసుల వ్యాక్సిన్ తీసుకున్న సిటిజన్స్ కు ట్రావెల్ నిబంధనలను సడలించారు. 12 ఆఫ్రికన్ దేశాలతో సహా గతంలో ట్రావెల్ బ్యాన్ విధించిన అన్ని దేశాలకు ప్రయాణించవచ్చు. ఈ మేరకు జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జిసిఎఎ), నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌సిఇఎంఎ) వెల్లడించింది.  కొత్త నిబంధనలు ఫిబ్రవరి 6 (ఆదివారం) నుండి అమల్లోకి రానున్నాయి. నిబంధనలు సడలించిన ఆఫ్రికా దేశాల్లో కెన్యా, టాంజానియా, ఇథియోపియా, నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దక్షిణాఫ్రికా, బోట్స్వానా, ఎస్వాటిని, లెసోతో, మొజాంబిక్, నమీబియా, జింబాబ్వే ఉన్నాయి. అయితే వ్యాక్సిన్ తీసుకోని (మెడికల్ మినహాయింపు) ఉన్నవారి మాత్రం సామాజిక దూరం, మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం లాంటి కొవిడ్-19 నియంత్రణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com