సౌదీలో ఇఖామా, రీ-ఎంట్రీ వీసా గడువు పొడిగింపు
- February 05, 2022
సౌదీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా ట్రావెల్ బ్యాన్ విధించిన 19 దేశాల నుండి వచ్చిన ప్రవాసులు రెసిడెన్సీ పర్మిట్ (ఇఖామా) చెల్లుబాటు గడువును మార్చి 31 వరకు పొడిగించారు. తాజా నిర్ణయంతో ఆయా దేశాల వారు ప్రయోజనం పొందుతారని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజత్) ప్రకటించింది. 19 దేశాల్లో టర్కీ, లెబనాన్, ఇథియోపియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, మొజాంబిక్, బోట్స్వానా, లెసోతో, ఎస్వతిని, మలావి, జాంబియా, మడగాస్కర్, అంగోలా, సీషెల్స్, మారిషస్, కొమొరోస్, నైజీరియా ఉన్నాయి. ఈ దేశాలకు ఎగ్జిట్, రీ-ఎంట్రీ వీసా చెల్లుబాటును ఆటోమెటిక్ గా పొడిగించడం ప్రారంభించినట్లు జవాజాత్ ప్రకటించింది. అయితే ఒక డోస్ కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రవాసులకు ఈ పొడిగింపు వర్తించదు. అలాగే విజిట్ వీసాల చెల్లుబాటు గడువును కూడా పొడిగించడం జరిగిందని వెల్లడించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







