ఫిబ్రవరి 6 నుండి ‘లిబరేషన్ టవర్’ ప్రారంభం
- February 05, 2022
కువైట్: కువైట్ జాతీయ సెలవుదినాల వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 6వ తేదీ నుండి లిబరేషన్ టవర్ ను ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ నెల 28 వరకు ఉచితంగా సందర్శించవచ్చు. లిబరేషన్ టవర్ వెబ్‌సైట్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోవాలి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పాఠశాల విద్యార్థులకు, అధికారిక సంస్థలకు ప్రవేశాన్ని కేటాయించారు. సాయంత్రం 3:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు ప్రజలందరికీ అనుమతి ఇవ్వనున్నారు. టవర్ 150వ అంతస్తు నుండి 360 డిగ్రీల వీక్షణ ప్రధాన ఆకర్షణగా నిల్వనుంది. టవర్ వద్ద ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. లిబరేషన్ టవర్ కువైట్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి. దీని నిర్మాణం 1986 సంవత్సరంలో ప్రారంభమైంది. యుద్ధం వల్ల నిలిచిన నిర్మాణాన్ని 1993లో పునఃప్రారంభి 1996లో పూర్తిచేశారు. 372 మీటర్ల ఎత్తైన టవర్‌ను దివంగత అమీర్ షేక్ జాబర్ అల్-అహ్మద్ మార్చి 1996లో ప్రారంభించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







